Header Banner

దామరగిద్దలో ఘోర విషాదం! ఆడుకోవడానికీ వెళ్ళి అనంత లోకాలకు చేరుకున్న చిన్నారులు!

  Mon Apr 14, 2025 17:28        Others

రంగారెడ్డి జిల్లా దామరగిద్ద గ్రామంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బంధువుల పెళ్లికి వచ్చిన సమయంలో ఐదేళ్ల తన్మయశ్రీ, నాలుగేళ్ల అభినయశ్రీ అనే అక్కాచెల్లెళ్లు ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారులో ఆడుకుంటూ వెళ్లి చిక్కుకుపోయారు. ప్రమాదవశాత్తు కారు డోర్లు ఆటోమేటిక్‌గా లాక్ అయిపోవడంతో వారు లోపలే ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటం, ఆక్సిజన్ లోపం కారణంగా వారు ఊపిరాడక స్పృహ కోల్పోయారు. తల్లిదండ్రులు ఆలస్యం గా గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లినా అప్పటికే చిన్నారులు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సంఘటనతో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

ఇలాంటి ఘటనలు మరల జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కారు దిగే ముందు వెనుక సీటులో ఎవరైనా ఉన్నారా అని ఖచ్చితంగా చూడాలి. మొబైల్ ఫోన్ లేదా పర్స్ వంటి ముఖ్యమైన వస్తువులను వెనుక సీటులో ఉంచడం వల్ల కారును లాక్ చేయడం ముందు వెనుక డోర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. పిల్లలు కారులో ఉన్నప్పుడు గుర్తుగా ఒక బొమ్మను ముందు సీటులో ఉంచి, వారు దిగిన తరువాత తిరిగి వెనుక పెట్టే అలవాటు మంచిది. కారు ఎప్పుడూ లాక్ చేసి ఉంచాలి, కీలు పిల్లలకు అందుబాటులో ఉండకూడదు. చైల్డ్ లాక్, పవర్ విండో లాక్ వంటివి సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకు కారు ఆడుకునే స్థలం కాదని, ఒంటరిగా అందులో ఉండకూడదని స్పష్టంగా నేర్పించాలి. ఒకవేళ ఇతరుల పిల్లలు కారులో ఒంటరిగా ఉన్నారు అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి లేదా అత్యవసరంగా డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయాలి. చిన్నపాటి నిర్లక్ష్యం విలువైన ప్రాణాలను కోల్పోయే ప్రమాదానికి దారితీస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

 

ఇది కూడా చదవండిఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులు, వానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!

 

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

 

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

 

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #ShockingIncident #TragicLoss #Heartbreaking #DamargiddaTragedy #CarLockDeath #ChildSafetyFirst